Posts

మామిడి పండు తింటే 5 ఉపయోగాలు… తెలుసా?

మామిడికి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉంది. ఇది భారతదేశపు జాతీయ ఫలం. మామిడి పండు లో ఎ, సి విటమిన్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇందులోని సి- విటమిన్‌ అద్భుత యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. మామిడి రుచిలోనే కాదు శరీర సౌందర్యానికి, ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. వివిధ రుచుల్లో ఆకారాల్లో, సైజుల్లో, రంగుల్లో లభించే మామిడి పండ్లలో ఎన్నో రకాల ఔషధగుణాలు , ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. 1. మామిడిపండు మంచి జీర్ణకారి. ఇది అజీర్ణం మరియు అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబందిత సమస్యలను తగ్గిస్తుంది. మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజవంతమైన బరువు పెరిగే అవకాశం ఉంది. 2. దానిలో ఐరన్ సమృద్దిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో మామిడిపండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే కాపర్ ఎర్ర రక్తకణాల వృద్దికి దోహదపడుతుంది. 3. మామిడి పండును పండ్లలో రారాజుగా పిలుస్తారు. ఇందులో ఉండే పొటాషియం మరియు మెగ్నీషియం అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది. విటమిన్ సి మరియు ఫైబర్ శరీరంలో హాని చేసే కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. 4. మామిడి పండును తినడం వ
Recent posts